Revanth Reddy (photo-Video Grab)

Hyd, Feb 23: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండు స్కీంల అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా (Priyanka Gandhi To Launch Two Schemes) ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం వెళ్లి సమ్మక్క- సారలమ్మలను రేవంత్‌ (CM Revanth Reddy) దర్శించుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మేం ఇక్కడి నుంచే ప్రారంభించాం. ‘హాథ్‌ సే హాత్‌ జోడో యాత్ర’ ఇక్కడి నుంచే ప్రారంభించా. మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు రాకుండా రూ.110 కోట్లు మంజూరు చేశాం’’ అని చెప్పారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

రైతుల‌కు ఇచ్చిన రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై బ్యాంకుల‌తో చ‌ర్చిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే రైతుల‌కు మంచి శుభ‌వార్త చెప్ప‌బోతున్నామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, తెల్ల‌రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.

Here's Videos

రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను విప్పుతూ, ప్ర‌జా స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తున్నామ‌ని అన్నారు. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య ప‌రిమితి రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచామ‌ని సీఎం ప్రస్తావించారు.ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తిహామీని అమ‌లు చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

ఈ నెల 27 నుంచి నూ. 500కే సిలిండర్, 200 యూనిట్లు లోపు కరెంట్ బిల్లు వస్తే జీరో బిల్లు, మరో రెండు గ్యారెంటీలు అమలుకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి సర్కారు

అధికారంలోకి వ‌చ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని, 6,956 మంది స్టాఫ్ న‌ర్సుల నియామ‌కం, 441 సింగ‌రేణి ఉద్యోగులు, 15 వేల పోలీసు, ఫైర్ డిపార్టుమెంట్ ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. మార్చి 2వ తేదీన మ‌రో 6 వేలపైచిలుకు ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌బోతున్నామ‌న్నారు. రెండు ల‌క్ష‌ల ఖాళీలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పామో... దానికి త‌గిన‌ట్లు 25 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని, వాటిని ప్ర‌జ‌ల‌కు క‌నిపించేలా.. కుళ్లుకుంటున్న వారికి వినిపించేలా ఎల్‌బీ స్టేడియంలో నే వేలాది మంది స‌మ‌క్షంలో వారికి నియామ‌క ప‌త్రాలు ఇచ్చామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

మేడారం జాతర: వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదు. జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చెప్పినట్లుగా పత్రికల్లో చూశాను. కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోంది. రూ.వందల కోట్లు విడుదల చేసింది. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు మాత్రం కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనేందుకు ఈ జాతర పట్ల వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా చెప్పారు.

ఆ మాదిరిగానే మేడారం జాతరను వారిద్దరూ వచ్చి దర్శించుకోవాలి. వారిని అధికారిక హోదాలో స్వాగతం పలికే బాధ్యతను నేను, మంత్రివర్గం చూసుకుంటాం. మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమంటూ కిషన్‌ రెడ్డి ఆదివాసీలను అవమానించొద్దు. సీఎం కేసీఆర్‌ మేడారం సందర్శించుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. భవిష్యత్తులో మీకూ అదే పరిస్థితి వస్తుందని కిషన్‌ రెడ్డికి చెబుతున్నా. కేంద్రం ఉత్తర, దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం మంచిది కాదు. దక్షిణ భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మేడారం జాతరకు గుర్తింపు ఉందని సీఎం తెలిపారు.