Representational (Credits: Twitter/ANI)

Hyd, Dec 25: తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరు రోగులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు జూనియర్‌ డాక్టర్‌లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు.. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. మృతులను 60 ఏళ్ల వ్యక్తితోపాటు 40 ఏళ్ల వ్యక్తిగా తెలిపారు.

దేశంలో 69కి పెరిగిన కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసులు, తాజాగా ముగ్గురు క‌రోనాతో మృతి, గోవాలో అత్యధికంగా 34 జేఎన్ 1 వేరియంట్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 55 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 45 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రిలో 54 పాజిటివ్‌ చేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్‌ టెస్ట్‌లు పెంచారు. ఇక దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్‌ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 4,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో… దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి