Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, August 29: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,751 పాజిటివ్‌ కేసులు (New COVID-19 Cases in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,116కు (COVID-19 in Telangana) చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 808కి (Coronavirus Deaths) చేరింది. తాజాగా 1675 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 89,350 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.49 శాతంగా ఉండగా.. తెలంగాణలో 74.3 శాతంగా ఉంది.

23,049 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పింది. కొత్తగా 62,300 శాంపిల్స్‌ టెస్టు చేయగా.. ఇప్పటికీ 12,66,643 టెస్టులు చేసినట్లు వివరించింది. ఇంకా 1010 రిపోర్టులు రావాల్సి ఉందని, ఒక మిలియన్‌ జనాభాకు 34,177 పరీక్షలు చేసినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన 2,751 పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీలో 432, కరీంనగర్‌ 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 128, నిజామాబాద్‌ 133, సూర్యాపేఏట 111, వరంగల్‌ అర్బన్‌ 101 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనాపై గుడ్ న్యూస్, దేశంలో 26 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ ఉన్న కేసులు 7,52,424 మాత్రమే, దేశంలో తాజాగా 76,472 కేసులు నమోదు, 62,550కు పెరిగిన మరణాల సంఖ్య

కరోనాకు చంపే శక్తి లేదని, అయితే నిర్లక్షం వహిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ (Etela Rajender) హెచ్చరించారు. వైరస్‌ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చని, అందుకే పరీక్షల సంఖ్య పెంచినట్లు చెప్పారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాల శాతం తక్కువగా ఉందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శుక్రవారం మంత్రి ఈటల సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పట్టణ పేదల ముంగిటికి వైద్యసేవలు తీసుకురావడమే లక్ష్యంగా బస్తీ ఆస్పత్రులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 200 ప్రారంభించామని, మరో 100 బస్తీ దవాఖానాలు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. వీటిలో సాయంత్రం క్లినిక్‌లు కూడా ప్రారంభించామన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ), బస్తీ ఆస్పత్రుల్లో 145 చోట్ల టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. ఇవి కాకుండా మొబైల్‌ క్యాంప్‌లు కూడా పెడుతున్నట్లు పేర్కొన్నారు. వారం నుంచి తెలంగాణలో రోజుకు 50–60 వేల టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. పీవీ నరసింహారావుకు 'భారతరత్న' ప్రకటించాలి, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్

కరోనా బాధితులను, వారి కుటుంబాలను చిన్నచూపు చూడడం, వెలివేసినట్లు ప్రవర్తించడం మంచిది కాదని మంత్రి ఈటల అన్నారు. ఈ రెండింటినీ పోగొట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు ముందుకు రావాలని కోరారు. అలాగే బస్తీల్లోనూ అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైతే స్వయంగా తానే వచ్చి పాల్గొంటానని తెలిపారు.

పాజిటివ్‌ వచ్చిన వాళ్ళు ఉండేందుకు కమ్యూనిటీ హాల్స్, క్లబ్‌ హౌజ్‌లను ఇస్తే, వారికి మందులు, భోజనం ప్రభుత్వం నుంచి అందజేస్తామని చెప్పారు. పరీక్షలు, చికిత్స ఎక్కడ అందుతుందో వివరాలు తెలియజేయడానికి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం రూ.30 లక్షల వరకూ వసూలు చేయడం సబబు కాదన్నారు. ఇలాంటి కష్టసమయంలో వ్యాపారం చేయవద్దన్నారు. ప్రభుత్వా సుపత్రుల్లో అన్ని వసతులూ అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్‌కి వెళ్లి అప్పులపాలు కావొద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు