COVID-19 Vaccine (Photo Credits: Twitter)

Hyderabad, June 24: తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గడంతో లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేసిన ప్రభుత్వం జూలై 1 నుంచి విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు చేస్తుంది. అనేక నెలల ఆన్‌లైన్ తరగతుల తర్వాత విద్యార్థులను తిరిగి తరగతి గదులకు ఆహ్వానించడానికి కళాశాలలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులకు, అధ్యాపకులకు మరియు బోధనేతర సిబ్బందికి టీకాలు వేయడాన్ని వేగవంతం చేశారు. క్యాంపస్‌లలో ఉన్న వారందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రత్యేక టీకా డ్రైవ్‌లు చేపడుతున్నారు. ప్రతిరోజూ 150 నుండి 200 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినప్పటికీ వ్యాప్తి ఇంకా కొనసాగుతుంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,19,466 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,088 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 965 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,17,776కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 137 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నల్గొండ నుంచి 84, సూర్యాపేట నుంచి 72 మరియు భద్రాద్రి కొత్తగూడెం నుంచి 71 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 9 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,607కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 1511 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,98,139 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,030ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.