Hyderabad, July 10: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 1278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 32,224 కి చేరుకుంది.
ఇక గత రెండు, మూడు రోజులుగా వచ్చే కేసుల సరళిని పరిశీలిస్తే, హైదరాబాద్ మాత్రమే కాకుండా నగరానికి అనుబంధంగా ఉండే ప్రాంతాలలో ఎక్కుడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 762 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా, రంగారెడ్డి నుంచి 171 కేసులు , మేడ్చల్ నుంచి 85 మరియు సంగారెడ్డి నుంచి 36 కేసులు వచ్చాయి.
శుక్రవారంవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana's COVID Bulletin:
మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 339 కు పెరిగింది.
అలాగే, శుక్రవారం సాయంత్రం వరకు మరో 1013 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 19,205 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,680 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో 'మల్లన్న' పిటిషన్, పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదని పిటిషనర్‌పై హైకోర్ట్ 'తీన్మార్'
గత 24 గంటల్లో ఇటీవల కాలంలోనే అత్యధికంగా 10,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,51,109 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.