
Hyderabad, July 28: తెలంగాణలో రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం . గత 24 గంటల్లో 15,839 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా కొత్తగా మరో 1610 మందికి పాజిటివ్ అని తేలింది, అందులో ఇంకా 809 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,79,081 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 57,142 కి చేరుకుంది. మొన్నటివరకు హైదరాబాద్ కేంద్రంగా విజృంభించిన కరోనావైరస్ ఇప్పుడు క్రమంగా వ్యాప్తి తగ్గుతూ వస్తున్నట్లు అరోగ్య శాఖ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
సోమవారం వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 531 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 172 మేడ్చల్ నుంచి 113 మరియు సంగారెడ్డి జిల్లా నుంచి 74 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
ఇక పలు జిల్లాల్లో కూడా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఒక్క వరంగల్ అర్బన్ జిల్లా నుంచే 152 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఉమ్మడి కరీంనగర్ మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి మొత్తం కలిపితే 100కు పైగానే కేసులు వచ్చాయి.
Telangana's COVID Bulletin:

జూలై 27న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 480 కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 803 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 42,909 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,753 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.