Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 163 కోవిడ్ కేసులు నమోదు, 1700కి చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో నేడు హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోస్ కోవిడ్ టీకా పంపిణీ
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత రాత్రి 8 గంటల వరకు 24,920 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 163 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 637 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.....
Hyderabad, February 18: తెలంగాణలో తొలి డోసు తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లకు రెండో మోతాదు టీకాను గురువారం అందించనున్నారు. అలాగే ఇప్పటివరకు టీకా వేయించుకోని ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల మంది టీకా అందుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత రాత్రి 8 గంటల వరకు 24,920 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 163 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 637 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,97,113కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 31 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 12, రంగారెడ్డి నుంచి 12, మరియు కరీంనగర్ జిల్లా నుంచి 9 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,622కు పెరిగింది. బుధవారం సాయంత్రం వరకు మరో 101 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,93,791 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1700 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Feb 18, 2021 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

