TS COVID Update: తెలంగాణలో కొత్తగా మరో 148 కోవిడ్ కేసులు నమోదు, 1640కి చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో కొనసాగుతున్న కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్
Hyderabad, February 17: తెలంగాణలో హెల్త్ కేర్ వర్కర్లకు రెండో మోతాదు వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. అలాగే టీకా వేయించుకునేందుకు వస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకూ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. తొలి విడతలో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి 28 రోజుల్లో రెండో డోస్ టీకా ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్నటివరకు 2,79,518 మంది కోవిడ్ టీకాలు చేయించుకున్నట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను గమనిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 24,695 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 148 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 459 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,96,950కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 26 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 11, రంగారెడ్డి మరియు కరీంనగర్ జిల్లాల నుంచి చెరి 10 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో కోవిడ్ మరణం నమోదవడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,620కు పెరిగింది. మంగళవారం సాయంత్రం వరకు మరో 150మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,93,960మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1640 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Feb 17, 2021 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

