COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1921 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 88 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 674కు పెరిగిన కరోనా మరణాలు

కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ మరియు వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి 70కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో కూడా కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది....

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1921 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 88 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 674కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Hyderabad, August 14:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 22,046 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో  2,256 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1151 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,11,196 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 88,396కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 356 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 168 ,  రంగారెడ్డి జిల్లా నుంచి 134,  మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 90 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

అలాగే  కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ మరియు వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి 70కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో కూడా కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 13న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 674 కు పెరిగింది.

అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 1210 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 64,284 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,438 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 14, 2020 09:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).