Corona in Telangana: తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 194 మందికి పాజిటివ్, కోవిడ్‌తో మరో ముగ్గురు మృతి, రాష్ట్రంలో 1855కి పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఒకరోజును మించి మరో రోజు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య తక్కువవుతుండటం గమనార్హం....

Corona in Telangana: తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 194 మందికి పాజిటివ్, కోవిడ్‌తో మరో ముగ్గురు మృతి, రాష్ట్రంలో 1855కి పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య
COVID Outbreak- Representational Image (Photo Credits: IANS)

Hyderabad, March 11: తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఒకరోజును మించి మరో రోజు కేసులు నమోదవుతున్నాయి.  మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య తక్కువవుతుండటం గమనార్హం.  ఈ క్రమంలో రాష్ట్రంలో ఆక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతుంది.

నిన్న రాత్రి 8 గంటల వరకు 37,904 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 194 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 525 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,00,536కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 35 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 14, మరియు రంగారెడ్డి నుంచి 16 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,649కు పెరిగింది.

మరోవైపు బుధవారం సాయంత్రం వరకు మరో 115 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,97,032 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1855 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Mar 11, 2021 09:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).