COVID 19 Testing (Photo Credits: Pixabay)

Hyderabad, June 6: తెలంగాణలో శనివారం మరో 206  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 3496 కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3048 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో  అత్యధికంగా 152 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తర్వాత  మేడ్చల్ నుంచి 18, రంగారెడ్డి జిల్లా నుంచి 10,  నిర్మల్ 5, యాదాద్రి 5, మహబూబ్ నగర్ నుంచి 4, నాగర్ కర్నూల్ 2, జగిత్యాల 2, వికారాబాద్, జనగాం, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్ మరియు మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.

ఇటు కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూపోతోంది. శనివారం మరో 10 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 123 కు పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా!

ఇదిలా ఉంటే ఈ ఒక్కరోజులోనే అత్యధికంగా మరో 123 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1710 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1663 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

 

Status of positive cases of #COVID19 in Telangana

 

ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల్లో 206మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది. అలాగే ఇతర దేశాల నుంచి స్వదేశానికి చేరుకుని ప్రస్తుతం క్వారైంటైన్లో ఉన్నవారిలో 212 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరితో పాటు మరో 30 మంది విదేశీయులు కూడా పాజిటివ్ వచ్చిన వారి జాబితాలో ఉన్నారు. మొత్తంగా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 448 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఇక దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న భారత్ ఇప్పటికే సుమారు 2.40 లక్షల కోవిడ్-19 పాజిటివ్ కేసులతో ఇటలీని దాటేసి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు అధికంగా ఉన్న జాబితాలో 6వ స్థానంలోకి వచ్చింది.