COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 2,159 పాజిటివ్ కేసుల నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 65 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, వెయ్యి దాటిన కరోనా మరణాలు

గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1005 కు పెరిగింది....

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 2,159 పాజిటివ్ కేసుల నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 65 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, వెయ్యి దాటిన కరోనా మరణాలు
Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, September 17:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 53,094 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,159  మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 908 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,29,316 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,65,003కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 318 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి నుంచి 176,  మేడ్చల్ నుంచి 121 కేసులు నిర్ధారణయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ విజృంభన కొనసాగుతోంది,  పలు జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నివేదించబడ్డాయి. నిన్న నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే సిద్ధిపేట నుంచి 132, కరీంనగర్ నుంచి 127 మరియు వరంగల్ అర్బన్ నుంచి 98 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1005 కు పెరిగింది.

అలాగే,  బుధవారం సాయంత్రం వరకు మరో 2108 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,33,555 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,443 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Sep 17, 2020 09:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).