COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 2384 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో1,04,249 దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 755కు పెరిగిన కరోనా మరణాలు
COVID19 Outbreak in India | (photo-PTI)

Hyderabad, August 23:  తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఇందుకు తగ్గట్లుగా ప్రభుత్వం  కూడా  టెస్టుల సంఖ్య గతంలో కంటే రెట్టింపు చేసింది.  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 40,666 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో  2,384 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1347 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,31,839 మందికి టెస్టులు నిర్వహించినట్లు  రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,04,249కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 472 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి జిల్లా నుంచి 131, సంగారెడ్డి నుంచి 61  మరియు మేడ్చల్  జిల్లాల నుంచి 52  పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నిన్న ఒక్కరోజే 100కు పైగా కేసులు నమోదవడం గమనార్హం. నిజామాబాద్ నుంచి 148, నల్గొండ నుంచి 137, కరీంనగర్ నుంచి 120, సిద్ధిపేట నుంచి 110, జగిత్యాల నుంచి 105, ఖమ్మం నుంచి 105 కేసులు రాగా, మంచిర్యాల నుంచి 90 మరియు వరంగల్ అర్బన్ నుంచి మరో 85 కొత్త కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి.

ఈ గణాంకాలను బట్టి చూస్తే జిల్లాల్లో కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు అర్థమవుతోంది, ప్రజలు వైరస్ పట్ల భయం లేకుండా తేలికగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 22న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 11  కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 755 కు పెరిగింది.

అలాగే, శనివారం సాయంత్రం వరకు మరో 1851 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 80,586 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,908 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.