Hyderabad, June 18: తెలంగాణలో గురువారం మరో 352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 6,027 కు చేరుకుంది.
హైదరాబాద్ లో కరోనా ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 302 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తరువాత రంగారెడ్డి నుంచి 17, మేడ్చల్ నుంచి 10, మంచిర్యాల నుంచి 4, జనగాం, వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి 3 చొప్పున, సంగారెడ్డి, భూపాలపల్లి, మహబూబ్ నగర్ 4, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి 2 చొప్పున అలాగే వరంగల్ రూరల్, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.
గురువారం మరో ముగ్గురు కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 195 కు పెరిగింది.
Telangana's #COVID19 Report:
ఇదిలా ఉంటే ఈరోజు మరో 230 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,301 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,531 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.