Hyderabad, August 11: డయాలసిస్ సపోర్ట్‌లో ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండాల రోగులపై సెకండ్ వేవ్ కోవిడ్ ప్రమాదకరంగా పరిణమించిందని పరిశోధకులు చేపట్టిన తాజా సర్వేలో వెల్లడైంది. అటువంటి రోగులలో మరణాలు ఎక్కువగా నమోదైనట్లు సూచించింది. వారి అధ్యయనంలో భాగంగా, మార్చి 15 మరియు జూన్ 15 మధ్య భారతదేశంలో నమోదైన కోవిడ్ మరణాలను పరిశీలిస్తే చాలా మంది డయాలసిస్ పేషేంట్లు ఉన్నట్లు తెలిసింది. అయితే కోవిడ్ టీకాలు తీసుకున్న వారిలో ఎక్కువ శాతం ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ (ISN) కిడ్నీ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ (KI) పేర్కొన్నాయి. అలాగే వృద్ధాప్యం, డయాబెటీస్ మైయు ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారిలో ఒక డోస్ టీకా పొందిన తర్వాత కూడా కోవిడ్ -19 నిర్ధారణ అయినప్పటికీ కూడా ప్రాణాపాయం 46 శాతం తగ్గించబడిందని వెల్లడైంది. సెకండ్ వేవ్ కోవిడ్ సమయంలో దేశంలో భారీగా కేసులు మరియు మరణాలు నమోదైన నేపథ్యంలో ఎందుకు ఇంతగా ప్రాణనష్టం జరిగిందనేదానిపై పరిశోధకులు అధ్యయనం చేపట్టగా డయాలసిస్, డయాబెటీస్, వృద్ధాప్యం లాంటి కారణాలే ఉన్నట్లు తేలింది. అలాగే ఒక్క డోస్ అయినా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా చాలా నష్టం మరింత పెరగకుండా నియంత్రించడం సాధ్యమైందని వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 88,164 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 482 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,417 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,50,835కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 61, వరంగల్ అర్బన్ నుంచి 41 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,833కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 455 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,38,865మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,137 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.