COVID in TS: దేశంలోనే మొట్టమొదటగా ఆ గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్; తెలంగాణలో కొత్తగా 591 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,819కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

గ్రామంలో 100 శాతం వ్యాక్సినేషన్ జరగడంతో కరోనా మహమ్మారి నుండి రాజన్నపేట కవచం పొందినట్లు అయింది. టీకా వేసుకునేందుకు అర్హులైన మరియు ఇతర ఎలాంటి అనారోగ్య కారణాలు లేని 18 ఏళ్లపై బడిన వారందరికీ టీకాల కనీసం ఒక డోస్ పంపిణీ జరిగింది...

COVID in TS: దేశంలోనే మొట్టమొదటగా ఆ గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్; తెలంగాణలో కొత్తగా 591 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో  8,819కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
COVID-19 Vaccine (Photo Credits: PTI)

Hyderabad, August 2: తెలంగాణలో సెకండ్ వేవ్ కోవిడ్ అదుపులో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోంది.  రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని రాజన్నపేట గ్రామం దేశంలో మొట్టమొదటి 'కోవిడ్-స్థితిస్థాపక' గ్రామంగా అవతరించింది. ఈ గ్రామంలో వ్యాక్సిన్ కు అర్హులైన వారందరూ కోవిడ్ టీకాలు వేసుకున్నారు. గ్రామంలో 100 శాతం వ్యాక్సినేషన్ జరగడంతో కరోనా మహమ్మారి నుండి రాజన్నపేట కవచం పొందినట్లు అయింది. టీకా వేసుకునేందుకు అర్హులైన మరియు ఇతర ఎలాంటి అనారోగ్య కారణాలు లేని 18 ఏళ్లపై బడిన వారందరికీ టీకాల కనీసం ఒక డోస్ పంపిణీ జరిగింది. ఇంకా కొద్ది మందికి రెండో డోస్ అందాల్సి ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,07,472 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 591 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1154 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,45,997కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 68 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి అత్యధికంగా 75, ఖమ్మం జిల్లా నుంచి 58 మరియు వరంగల్ అర్బన్ నుంచి 51, కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,807కు పెరిగింది. అలాగే సాయంత్రం వరకు మరో 643 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,33,371 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,819 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 02, 2021 09:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).