Corona in Telangana: కోవిడ్19 సోకిన తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వవచ్చా? వైద్యుల సలహా ఇలా ఉంది; తెలంగాణలో కొత్తగా 623 కోవిడ్ కేసులు నమోదు, స్వల్పంగా పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus in India (Photo Credits: PTI)

Hyderabad, August 4:  తెలంగాణలో ఇటీవల కాలంగా నవజాత శిషువులకు  బ్రెస్ట్ ఫీడింగ్ భారీగా తగ్గినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.  చాలా మంది  కోవిడ్19 సోకిన పాలిచ్చే తల్లులు తమ బిడ్డలకు చనుబాలు పట్టడానికి భయపడుతున్నారు. ఎక్కడ మహమ్మారి తమ నుంచి తమ బిడ్డలకు సోకుందనే భయంతో బిడ్డలకు దూరంగా ఉంటున్నారు. అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తూ దీనిని అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్19 సోకి, చికిత్స తీసుకుంటున్న 15 రోజుల తర్వాత తల్లులు ఫేస్ షీల్డ్, ఫేస్ మాస్క్ మరియు హ్యండ్ గ్లౌజులు ఉపయోగించి పిల్లలకు పాలు పట్టవచ్చు, ఆ తర్వాత బిడ్డలకు దూరంగా ఉంటే సరిపోతుందని వైద్యులు అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,12,796 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 623 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1696 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,47,229కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 77 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 65, వరంగల్ అర్బన్ నుంచి 59 మరియు ఖమ్మం జిల్లా నుంచి 52 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,814కు పెరిగింది. అలాగే సాయంత్రం వరకు మరో 594 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,34,612 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,8037 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.