COVID in TS: తెలంగాణలో 1.41 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ; రాష్ట్రంలో కొత్తగా 645 పాజిటివ్ కేసులు నమోదు.. 9,237కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
COVID-19 Vaccination (Photo Credits: PTI)

Hyderabad, July 27: తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోంది. జనవరి 16న కోవిడ్ టీకా డ్రైవ్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా 1.41 కోట్ల మందికి టీకాల పంపిణీ జరిగింది. అయితే 1.41 కోట్ల మందిలో రాష్ట్రవ్యాప్తంగా 30.57 లక్షల మందికి రెండు డోసుల టీకా లభించగా, 1.11 కోట్ల మంది వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును పొందారు.

తెలంగాణలోని ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోవిడ్ టీకా కేంద్రాలలో ప్రతిరోజు సగటున 1.5 లక్షల మందికి టీకాలు పంపిణీ జరుగుతున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన ఒక్కరోజులో 1,59,719 మందికి వ్యాక్సినేషన్ చేయగా, వారిలో 1,20,482 మందికి కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోస్ పూర్తయిందని, మరో 39,237 మందికి మొదటి మోతాదు వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని పేర్కొన్నారు.

ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,23,166 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 645 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1505 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,42,436కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 కేసులు నిర్ధారణ కాగా, ఖమ్మం జిల్లా నుంచి 72, కరీంనగర్ నుంచి 58,  వరంగల్ అర్బన్ నుంచి 52 మరియు పెద్దపల్లి జిల్లా నుంచి 47 కేసుల చొప్పున నమోదయ్యాయి.

రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,791కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 729 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,29,408 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,237 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.