COVID in TS: తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు నమోదు మరియు 5 మంది మృతి; గడిచిన ఒక్కరోజులో మరో 605 మంది కరోనా నుంచి రికవరీ
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Hyderabad, July 14: తెలంగాణలో రోజూవారీ కోవిడ్ కేసుల్లో గణనీయమైన మార్పులేమి లేవు, గత కొద్దికాలంగా సుమారు 7 వందలకు అటుఇటుగా నమోదవుతున్నాయి. అయితే దేశంలో సెకండ్ వేవ్ తర్వాత త్వరలోనే థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయనే ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చురుకుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో 1.28 లక్షల డోసుల పంపిణీ జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,15,237 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 749 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,019 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,33,895కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా 96 కేసులు నిర్ధారణ కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72,  కరీంనగర్ నుంచి 58,  వరంగల్ అర్బన్ నుంచి 55 మరియు నల్గొండ నుంచి 54 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 5 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,743కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 605 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,19,949 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,203 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.