Second Wave in TS: తెలంగాణలో కొత్తగా 987 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 1362 మంది రికవరీ; దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
దేశంలో రోజువారీ కరోనావైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ సెకండ్ వేవ్ ఇంకా అయిపోలేదన్న విషయం గుర్తుంచుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ హెచ్చరించారు....
Hyderabad, June 29: దేశంలో సెకండ్ వేవ్ కరోనా అదుపులోకి వస్తుంది, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే దేశంలో రోజువారీ కరోనావైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ సెకండ్ వేవ్ ఇంకా అయిపోలేదన్న విషయం గుర్తుంచుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ హెచ్చరించారు. గత ఏడాదిన్నర కాలంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇక తెలంగాణలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,21,236 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 987 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1327 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,22,593కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 130 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఖమ్మం నుంచి 102 కేసులు, నల్గొండ నుంచి 69, సూర్యాపేట నుంచి 64 మరియు భద్రాద్రి కొత్తగూడెం నుంచి 60 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 7 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,651కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 1362 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,05,455 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,487 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jun 29, 2021 07:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

