Hyd, Nov 25: తెలంగాణలో గత 24 గంటల్లో 993 కరోనా కేసులు (Covid In Telangana) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,042కి Covid In TS) చేరింది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు (Covid Deaths) కోల్పోగా, అదే సమయంలో 1,150 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు మొత్తం 2,53,715 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,441కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,886 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,594 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 62 కేసులు నిర్ధారణ అయ్యాయి.
భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,376 కోవిడ్ పాజిటివ్ కేసులు (Covid Cases in India) వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,22,217కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో 37,816 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,42,771కు చేరింది. కాగా కొత్తగా 481 కోవిడ్ మరణాలు సంభవించడంతో భారత్‌లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,34,699కు (Covid Deaths in India) చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు (Delhi Coronavirus) నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,40,541కు చేరింది. గడచిన 24 గంటల్లో 4,943 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో మొత్తం 4,93,419 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 38,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా దేశరాజధానిలో గంటకు ఐదుగురు చొప్పున మృత్యువాత పడుతున్నారు.