Covid in TS: తెలంగాణలో తాజాగా 978 పాజిటివ్ కేసులు, నలుగురు మృతితో 1307కు చేరుకున్న మరణాల సంఖ్య, రాష్ట్రంలో యాక్టివ్‌గా 19, 465 కేసులు
Coronavirus Outbreak | Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, Oct 25: రాష్ట్రంలో కరోనా సోకి కోలుకున్నవారి శాతం రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో రికవరీ రేటు 91.01శాతానికి చేరుకోగా, దేశంలో 89.09 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 40,79,668 లక్షల టెస్టులు పూర్తిచేయగా, 2,31, 252 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 2.10, 480 లక్షల మంది కోలుకోగా, 19,937 మంది ఇండ్లు, దవాఖానల్లో కోలుకుంటున్నట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. శనివారం 978 కేసులు (Covid-19 positive cases ) వెలుగుచూశాయి. నలుగురు మరణించినట్లు ( Four deaths) వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మరణాల సంఖ్య 1307కు చేరుకుంది. రాష్ట్రంలో 19, 465 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

కరోనా టీకాను అభివృద్ధిచేసేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) రంగంలోకి దిగింది. దిగ్గజ ఫార్మా సంస్థ అరబిందోతో కలిసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియ ప్రారంభమైందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ తయారీపై దృష్టిసారించినట్టు చెప్పారు. వ్యాక్సిన్‌ తయారీకి సమగ్ర ప్రణాళిక రూపొందించడాన్ని ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ అంటారు. ప్రస్తుతం సీసీఎంబీలో మూడు రకాల రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్టు రాకేశ్‌మిశ్రా వివరించారు. ఇందుకు 4నుంచి 5 నెలలు పడుతుందని చెప్పారు.

కరోనాతో ప్రమాదకర పరిస్థితుల్లో కొన్ని దేశాలు, రాబోయే నెలలు ఇంకా డేంజర్, పాఠశాలలను మూసివేయాలని సూచించిన డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు టెడ్రోస్

ఇందుకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అరబిందో అందిస్తుంది. ఆ తర్వాత ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ను అరబిందో ఫార్మాకు అప్పగిస్తారు. టీకా అభివృద్ధి, జంతువులు, మనుషులపై ప్రయోగాలు, అనుమతులు, వాణిజ్య ఉత్పత్తి వంటివన్నీ అరబిందో ఫార్మా చేపట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా టీకా పరిశోధనలు మొదలైనప్పటి నుంచే సీసీఎంబీపై ఒత్తిడి పెరిగింది. అయితే టీకా అభివృద్ధి ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అని, సరైన వ్యాపార భాగస్వామి దొరికేవరకు టీకాపై దృష్టి పెట్టబోమని సీసీఎంబీ పేర్కొన్నది