Corona in Telanagana: తెలంగాణలో కరోనా విశ్వరూపం, ఒక్కరోజులోనే 546 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 7 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 200 దాటిన కరోనా మరణాలు
COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, June 21:  తెలంగాణలో శనివారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో  546  కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.  తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 7,072కు చేరుకుంది.

అత్యధికంగా 458 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి.   ఆ తరువాత రంగారెడ్డి నుంచి 50 కేసులు నమోదయ్యాయి.  కరీంనగర్ 13, జనగాం 10, మేడ్చల్ 6, మహబూబ్ నగర్ 3, వరంగల్ రూరల్ మరియు ఖమ్మం జిల్లాల నుంచి 2 చొప్పున అలాగే ఆదిలాబాద్ మరియు వరంగల్ అర్బన్ జిల్లాల  ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.

శనివారం ఒక్కరోజే 5 మంది కోవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య  203 కు పెరిగింది.

#COVID19 in Telangana

Status of positive cases of #COVID19 in Telangana

ఇదిలా ఉంటే, శనివారం మరో 154 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,506మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,363 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 3,188 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 53,757 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.