Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు 6గురు కొత్త జడ్జీలు, కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్, రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే 33కు పెరగనున్న హైకోర్టు జడ్జీల సంఖ్య
High Court of Telangana | (Photo-ANI)

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు 6గురు న్యాయమూర్తులను నియమించాలంటూ సోమవారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌ అలియాస్‌ పి.ఎలమందర్, కాజా శరత్, జగన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫార్సుల్లో పేర్కొంది.

మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే, భాగ్యనగరాన్ని అర్థరాత్రి ముంచెత్తిన భారీ వర్షాలు, మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్‌ జారీ చేసిన అధికారులు

ఈ సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. సీజేఐగా ఎన్‌వీ రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచారు. ఏడాది కాలంలో 17 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో 27 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆరుగురికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జడ్జీల సంఖ్య 33కు పెరగనుంది.