COVID Outbreak - Representational Image (Photo-PTI)

Hyd, July 3: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,08,954 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 848 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,26,085కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,684కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 1,114 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,09,947కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,454 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 104 రోజుల తర్వాత వందకు దిగువన కేసులు నమోదయ్యాయి. తాజాగా 98 మందికి గ్రేటర్ లో కరోనా సోకింది.

భూవివాదం, ఫారెస్ట్ అధికారిపై పెట్రోలు పోసి నిప్పంటించబోయిన చెంచు మహిళ, ఈ వివాదాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

జిల్లాల వారీగా తాజా కేసులను పరిశీలిస్తే..ఆదిలాబాద్‌-3, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-33, జీహెచ్ఎంసీ-98, జ‌గిత్యాల‌-17, జ‌న‌గాం-05, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి-17, జోగులాంబ గ‌ద్వాల‌-4, కామారెడ్డి-4, క‌రీంన‌గ‌ర్‌-46, ఖ‌మ్మం-48, కొమురంభీం ఆసిఫాబాద్‌-5, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-16, మ‌హ‌బూబాబాద్‌-31, మంచిర్యాల‌-49, మెద‌క్‌-6, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి-45, ములుగు-25, నాగ‌ర్‌క‌ర్నూలు-10, న‌ల్ల‌గొండ‌-66, నారాయ‌ణ‌పేట‌-6, నిర్మ‌ల్‌-4, నిజామాబాద్‌-12, పెద్ద‌ప‌ల్లి-44, రాజ‌న్న సిరిసిల్ల‌-26, రంగారెడ్డి-42, సంగారెడ్డి-11, సిద్దిపేట‌-21, సూర్యాపేట‌-58, వికారాబాద్‌-5, వ‌న‌ప‌ర్తి-13, వ‌రంగ‌ల్ రూర‌ల్‌-11, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌-44, యాదాద్రి భువ‌న‌గిరి-23.