Hyd, July 24: తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు ఫోన్‌లో యూ ట్యూబ్ చూడొద్దని బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్‌తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మా లోతు రేణ–ప్రశాంత్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉదయ్(11) రాజన్నపేటలో ని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నా డు. పాఠశాలకు సెలవు దినం కావడంతో ఉదయ్ ఇంటి వద్ద ఉండగా తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికొచ్చిన వారికి ఉదయ్ కనిపించలేదు. రాత్రి పొద్దుపోయే వరకు గాలించారు.
ఇంట్లోని వంట గదికి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా గోడమేకుకు లుంగితో మెడకు చుట్టుకొని ఉరేసుకొని ఉన్నా డు. కొనఊపిరితో ఉన్న ఉదయ్‌ని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించా డు. యూట్యూబ్ చూడొద్దని చదువుకోవాలని మందలించిన పాపానికి చెట్టంతా కొడుకు మమ్మల్ని విడిచి వెళ్లాడని ఆ దంపతుల కన్నీరు మున్నీరు అయ్యారు. మృతుడి తండ్రి ప్రశాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.