Hyderabad, Nov 26: భాగ్య నగరంలో దారుణ ఘటన చోటు (Telangana Shocker) చేసుకుంది. బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పార్శిగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ (23) సికింద్రాబాద్‌లోని రంగురాళ్లు విక్రయించే దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈనెల 24న సాయంత్రం పార్శిగుట్టకు చెందిన బాలుడు (13)ని చాక్‌లేట్లు ఇస్తానని చెప్పి నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి (Minor boy raped by 23-year-youth ) పాల్పడ్డాడు.
తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు (Parents) చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. గత నెలలో దివ్యాంగ బాలుడిపై లైంగిక దాడి చేసిన ఘటన తెలంగాణలో వెలుగు చూసిన సంగతి విదితమే. మంచిర్యాల జిల్లాలో ఓ దివ్యాంగ బాలుడిపై కొంత మంది వ్యక్తులు కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.20 ఇచ్చి బాలుడితో అంగచూషణ, మైనర్‌తో ఓరల్ సెక్స్ ఘోరమైన నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్, మహమ్మద్ సాధిక్, గడ్డం నందు, బోగె రాయలింగు అనే వ్యక్తులు దివ్యాంగ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు శనివారం వెలుగులోకి వచ్చింది. వీరంతా కొద్ది రోజులుగా బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు జైపూర్ ఎస్సై రామకృష్ణ తెలిపారు. రెండు రోజలు కిందట బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కొండపల్లిలోని శాంతి నగర్ లో ఓ ఆరేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం అయింది. కొండపల్లి లోని శాంతి నగర్ ఇందిరమ్మ కాలనీలో ఆరేళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా, ఆ సమయంలో అటుగా వచ్చిన వ్యక్తి పిల్లవాడికి చాక్లెట్ కొనుక్కోడానికి డబ్బులు ఇస్తానని ఆశ చూపి పక్కనే ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ బాలుడిపై ఆ వ్యక్తి లైంగిక దాడికి దిగాడు. దీంతో అస్వస్థతకు గురైన బాలుడు ఆ తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.