lightning strike Representational Image (Photo Credits: Pixabay)

Hyd, Oct 6: తెలంగాణలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విషాదం (Telangana Shocker) చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై రెండు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. దసరా పండుగ సందర్భంగా జిల్లాలో (Warangal district) జఫర్గడ్ మండలం సాగరం శివారులోని గుట్టవద్ద పార్టీ చేసుకుంటుండగా పెద్దశబ్దంతో మర్రిచెట్టుపై పడ్డ పిడుగుతో (Three dead due to lightning strike) ముగ్గురు మృతి చెందారు.

మృతులు వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామానికి చెందిన నేరెల్లి శివ, మరుపట్ల సాంబరాజు, జెట్టబోయిన సాయికృష్ణగా గుర్తించారు.ఇక మహబూబాబాద్ జిల్లా గార్లలో పిడుగుపాటుకు ఎముల సంపత్ అనే వ్యక్తి మృతి చెందాడు.మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యంతో కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి, పలువురుకి గాయాలు

సద్దుల బతుకమ్మ పండుగకు తల్లిదండ్రులు బట్టలు కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లిలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ గట్ల సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి శంకరయ్య, శంకరమ్మ దంపతులు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.వీరి కూతురు వనిత (20) ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది.

సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ కోసం కొత్త బట్టలు కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడింది. మంగళవారం ఉదయం మళ్లీ తల్లితో గొడవ పడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు 108లో చికిత్స నిమి త్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోని భీమారం వద్ద చనిపోయింది.