Hyd, August 4: సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు (Patancheru) మండలం భానూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను తల్లి రేఖ (28), కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్ (27)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలని పోలీసులు వెల్లడించారు. కాగా వీరి బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత తన చిన్నారితో పాటు వరసకు మరిది అయిన వ్యక్తితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.