Indian Parliament (Photo credits: Wikimedia Commons)

Hyd, Dec 21: తెలంగాణ రాష్ట్రం ద్వారా ఆరు జాతీయ జలమార్గాలు (six national waterways) వెళ్తున్నాయని పార్లమెంట్ లో కేంద్రం తెలియజేసింది. అందులో గోదావరి– కృష్ణానది మినహా మిగతా ఐదు జాతీయ జలమార్గాలైన భీమా, మంజీరా, పెన్‌గంగ–వార్ధా, తుంగభద్ర, పెన్‌గంగ–ప్రాణహిత నదుల వ్యవస్థ జాతీయ జలమార్గాలు షిప్పింగ్, నావిగేషన్‌ కోసం సాంకేతిక–వాణిజ్యపరంగా ఆచరణీయం కాదని అధ్యయనంలో తేలిందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు.

ప్రస్తుతం నల్లగొండలోని సిమెంట్‌ పరిశ్రమల నుంచి సిమెంట్‌ తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉన్న ముక్త్యాల టెర్మినల్‌ను ఉపయోగించవచ్చా అని బీఆర్‌ఎస్‌ ఎంపీ డి.దామోదర్‌రావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. జాతీయ జలమార్గం–4 ఫేజ్‌–1లో భాగంగా కృష్ణా నదిపై ముక్త్యాల–విజయవాడ స్ట్రెచ్‌ (82 కి.మీ.) దశలవారీ పనుల అభివృద్ధికి ఇన్‌ల్యాండ్‌ భారత జలమార్గాల ప్రాధికార సంస్థ రూ.96 కోట్లు కేటాయించిందని వివరించారు.

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌తో ముగిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ, దేశంలోని ప్రస్తుత రాజకీయాలతో పాటు పంజాబ్‌ రాష్ట్ర పరిస్థితులపై చర్చలు

తెలంగాణలో 2014–15 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.5,238.93 కోట్లు విడుదల (Worth of 5,239 crore) చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. కాగా, రాష్ట్ర వాటాతో కలిపి రూ.8,584.98 కోట్లు వాడినట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 2014లో 668 ఉండగా, 2020లో 863కు చేరిందని బీఆర్‌ఎస్‌ ఎంపీ డి.దామోదర్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన–3 కింద 2,427.50 కి.మీ రహదారి నిర్మాణానికి కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. కాగా ఇందులో డిసెంబర్‌ 14 నాటికి 2,395.84 కి.మీ పొడవుతో 356 రోడ్డు పనులు ఇప్పటికే రాష్ట్రానికి మంజూరు చేశామని బీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు.

ఆ యువతి కిడ్నాప్ అంతా నాటకం, పెళ్లి కోసమే ఇదంతా చేసింది, పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలు, వీడియోను విడుదల చేసిన రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాపైన యువతి

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 47, తెలంగాణ నుంచి 42 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తులు అందగా అందులో ఏపీకి చెందిన 26, తెలంగాణకు చెందిన 19 దరఖాస్తులను ఆమోదించామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.