Atmakur Police Station (Photo-Video Grab)

Hyd, Nov 12: తెలంగాణలో దొంగతనం చేశారనే నెపంతో ఓ గిరిజన యువకుడిని చితకబాదిన కేసులో ఆత్మకూర్ (ఎస్‌) పీఎస్‌ ఎస్సైపై బదిలీ వేటు (Atmakur SI M. Lingam Transferred ) పడింది. ఓ కేసు విచారణ సందర్భంగా గిరిజన యువకుడు వీరశేఖర్‌ను ఎస్సై లింగం చితకబాదాడు. దీంతో ఎస్సై క్రూరత్వంపై జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు, నిరసనలు వెల్లువెత్తాయి. గిరిజన యువకుడు వీరశేఖర్‌ను చితకబాదిన (Alleged Torture of Tribal Youth) ఎస్ఐ ఎం.లింగంపై పోలీసు ఉన్నతాధికారుల చర్యలు చేపట్టారు. ఎస్ఐ లింగంను బదిలీ చేస్తూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ (Suryapet district superintendent of police) ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా సూర్యాపేట జిల్లాలో చేయని తప్పు ఒప్పుకోవాలంటూ గిరిజన యువకుడిని పోలీసులు తీవ్రంగా చితకబాదిన ఘటన బుధవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ యువకుడిని గోడ కుర్చీ వేయించారు.. ఆ యువకుడి మూత్రాన్ని అతడితోనే తాగించి రాక్షసానందం పొందారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆత్మకూరు(ఎస్‌) ఠాణా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రియురాలిని 18 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు, తనని పెళ్లి చేసుకోకుండా వేరొకరిని పెళ్లి చేసుకోవడమే కారణం, తెలంగాణలో దారుణ ఘటన

కాగా ఇటీవల ఓ దొంగతనం కేసులో ఆత్మకూరు మండలంలోని రామోజీతండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ను బుధవారం అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. విచారణ పేరుతో వీర శేఖర్‌పై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఎస్సై లింగంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని చితకబాదారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు కాల్‌ చేసిన వీరశేఖర్‌ను తీసుకెళ్లాలని అన్నారు. దీంతో ఒంటిపై గాయాలతో ఉన్న శేఖర్‌ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. తరువాత వీరశేఖర్‌ బంధువులు ఆగ్రహంతో గురువారం ఆత్మకూర్‌.ఎస్‌ పోలీస్‌ స్టేషన్‌ ముట్టడికి యత్నించారు.

పెళ్లికి ఒప్పుకోలేదని లవర్  గొంతు కోసి చంపేసిన ప్రేమోన్మాది, పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోదావరిఖని పోలీసులు

నడవలేని స్థితిలో ఉన్న వీరశేఖర్‌ను ట్రాక్టర్‌పై తీసుకొచ్చి ఆందోళన చేశారు. దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా, వీరశేఖర్‌ను రోజంతా గోడకుర్చీ వేయించి కొట్టారని, బాధ్యులైన ఎస్సై, సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దాదాపు 200 మంది గిరిజనులు ఆందోళనకు దిగారు. ఎస్ఐపై దాడికి యత్నించారు. వీరశేఖర్‌‌కు న్యాయం చేయాలని, ఎస్ఐని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై ఎస్పీ రాజేంద్రప్రసాద్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని సూర్యాపేట డీఎస్పీ మోహన్‌ కుమార్‌ తెలిపారు.