Suryapet, Jan 1: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనావైరస్ కలకలం రేపుతోంది. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం (22 of a family test positive for coronavirus ) ఆ జిల్లాలో ఆందోళన పుట్టిస్తోంది. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరైన వీరి అందరికీ కరోనా వైరస్ (Telangana suryapet coronavirus) సోకింది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మరణించారు. దీంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్‌షిప్‌కు చెందిన మృతుడి బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
అనంతరం వీరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు తలెత్తగా పరీక్ష చేయించుకోగా కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ (suryapet coronavirus) అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా తేలిందని డీఎంహెచ్‌ఓ హర్షవర్ధన్ తెలిపారు. బాధితుల్లో లక్షణాలేవీ కనిపించక పోయినా పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యాదాద్రి టౌన్ షిప్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటిని సర్వే చేస్తున్నారు. బాధితులంతా స్వీయ నిర్భందంలో ఉన్నారు.
ఇండియాలో మరో నలుగురికి కొత్త వైరస్, 29కి చేరిన మొత్తం కొత్త కరోనావైరస్ కేసులు, ఢిల్లీలో 10, బెంగళూరులో 10, హైదరాబాద్‌లో 3, పుణెలో 5, బెంగాల్‌లోని కళ్యాణిలో 1 కేసు నమోదు
ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా సోకడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో వైరస్ సోకిన కుటుంబం నివసించే కాలనీ మొత్తం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు చేస్తున్నారు.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 461 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 617 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,815 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,79,456 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,544కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,815 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,674 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 108 కరోనా కేసులు నమోదయ్యాయి