పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు శుభవార్తను అందించారు. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను (Discounts on Traffic Challans) ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ (huge discounts on traffic challans) ప్రకటించింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు మరింత వేగంగా జరిగేందుకు తెలంగాణ పోలీసు శాఖ (Telangana Traffcie police) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా చలాన్ల చెల్లింపుల్లో వాహనదారులకు ఊరట అందించినట్లుగా పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. ఇదిలా ఉంటే నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని పోలీసు శాఖ నిర్ణయించింది.
వీడియో ఇదిగో, పంజాగుట్ట అగ్ని ప్రమాదంలో తలుపులు పగులగొట్టి కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
ఇదిలా ఉండగా.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు.
చలాన్లలో డిస్కౌంట్ వివరాలు ఇవిగో..
►ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్
► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్
►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్
►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్.