Hyd, July 26: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో భారీ వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.స్థానిక ఎస్సై ఎస్కే తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం చిన్నబోయినపల్లికి చెందిన ఎస్కే జహంగీర్ (30) బీటెక్ చదువుకుని బతుకుదెరువు కోసం గ్రామంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో మందులు తీసుకువచ్చేందుకు చిన్నబోయినపల్లి నుంచి ఏటూరునాగారానికి 163 జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతుండగా పోతురాజు బోరు వద్ద రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం కూలి జహంగీర్ మీద పడింది. షాకింగ్, విద్యుత్ సిబ్బంది సాహసం, కరెంట్ ఇచ్చేందుకు వెళ్లి అవే విద్యుత్ వైర్ల సాయంతో వాగును దాటిన లైన్ మెన్, వీడియో వైరల్
ఈ ప్రమాదంలో జహంగీర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడిని వచ్చే నెలలో పెళ్లి చేద్దామనుకున్నామని అంతలోపే ఇలా విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యరు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కావేమోనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు