Telangana: మద్యానికి డబ్బులు ఇవ్వకుంటే చచ్చిపోతానని కొడుకు బెదిరింపు, ఇవ్వనని చెప్పిన తల్లి, మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్న కుమారుడు, తెలంగాణలో ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Representational Image (Photo Credits: File Image)

Hyderabad, july 24: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లితో గొడవపడిన ఓ కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య (Telangana Young man Suicide) చేసుకున్నాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి గూడ నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన చెవిబోయిన భాగ్యకు ఇద్దరు సంతానం.. కూతురు స్వప్న, కొడుకు ప్రసాద్‌(20). కాగా, ఆమె భర్త గతంలోనే చనిపోవడంతో జీవనోపాధి నిమిత్తం హైదరబాద్‌కు వెళ్లారు. అక్కడ ప్రసాద్‌ గత కొంతకాలంగా మద్యంతాగుతూ ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు.

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోతే (mother refusing to give him money) తాను ఆత్మహాత్య చేసుకుంటానని తరుచూ తన తల్లిని బెదిరించేవాడు. ఈక్రమంలో 21న మద్యం కోసం తల్లితో గోడవపడి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నాగిరెడ్డిపేటకు చేరుకున్నాడు. మరుసటిరోజు రాత్రి వరకు ప్రసాద్‌ తన ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

భార్యపై అనుమానం..గొడ్డలితో తల్లీ కూతుళ్లను నరికి హత్య చేసిన కసాయి భర్త, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు, నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లో దారుణ ఘటన

దీంతో ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకొని తలుపులను పాక్షికంగా ధ్వంసంచేసి చూడగా ప్రసాద్‌ ఇంట్లో దులానికి ఉరేసుకొని ఉన్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.