
Jangaon, Feb 16: జనగామ (Jangaon) జిల్లా పాలకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో ఆ లారీ అదే స్పీడ్ తో పాన్ షాపులోకి దూసుకెళ్లింది. ఫలితంగా అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. పొద్దు పొద్దున్నే జరిగిన ఈ ఘటనతో.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాన్ షాపులోకి దూసుకెళ్లిన లారీని జేసీబీ సాయంతో బయటకు లాగారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Here's Video:
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం..
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
పాన్షాపులోకి దూసుకెళిన రెండు వాహనాలు
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలు pic.twitter.com/VPS8uitpDO
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025
మరో ప్రమాదంలో తండ్రి..
కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తండ్రి ప్రాణాలు కోల్పోగా, కూతురికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నిజమాబాద్ జిల్లా కుకునూర్ గ్రామానికి చెందిన గంగాధర అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి శనివారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నాడు. తన కుమార్తె హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. ఇద్దరు కలిసి స్వగ్రామానికి కారులో బయల్దేరుతుండగా మార్గ మధ్యలో కారు ప్రమాదానికి గురై లారీకి, బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో గంగాధర మృతి చెందగా, ఆయన కుమార్తె లహరికి తీవ్ర గాయాలు అయ్యాయి.