Maoist Attack (Image used for representational purpose only) (Photo Credits: ANI)

Hyderabad, OCT 02: హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రను (plotted the blasts) పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రలో కీలకంగా పనిచేసిన జాహిద్ (Jahid) అనే వ్యక్తిని హైదరాబాద్, మూసారాంబాగ్‌లో సిట్ (SIT), టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుఝామున సిట్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు మహమ్మద్ జాహిద్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ (RSS) నేతలు, బీజేపీ నేతలపై దాడులతోపాటు, పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యక్రమాల కోసం కొంతమంది యువకులను కూడా రిక్రూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం ఆరుగురు యువకులను నియమించుకున్నాడు. గతంలో మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో కూడా పోలీసులు జాహిద్‌ను ప్రశ్నించారు. పలు తీవ్రవాద సంస్థలతో (Terror Organigations) జాహిద్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Indian Army Hits Terror Camps: పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి, 5 మంది పాకిస్తాన్ సైనికులు హతం, భారత జవాన్లపై దాడికి ప్రతీకారంగా అటాక్, అమరులైన ఇద్దరు జవాన్లు 

మూసారాంబాగ్‌తో పాటు సైదాబాద్, చంపాపేట్, బాబానగర్, పిసల్ బండ, సంతోష్ నగర్‌లో అర్ధరాత్రి సిట్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 20 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనితో సంబంధం ఉందని భావిస్తున్న బేగంపేట్ బ్లాస్ట్ కేసులో పాత నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Pulwama Terror Attack:మరో ఉగ్రదాడికి టెర్రరిస్టుల వ్యూహం, భద్రతా దళాల అలర్ట్‌తో తప్పిన ప్రమాదం, అజిత్ దోవల్‌ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు, పుల్వామా అటాక్ జరిగి నేటికి రెండేళ్లు పూర్తి, దాడిని ఎప్పటికీ మరచిపోలేరని తెలిపిన ప్రధాని మోదీ  

అరెస్టైన నిందితులంతా జాహిద్ ఆధ్వర్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీళ్లందరినీ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వీరి బ్యాంకు ఖాతాల లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పలువురి అకౌంట్లలోకి భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ జాహిద్ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నారు.