Hyderabad, July 16: కరోనా మహమ్మారి మూడోదశ ప్రభావంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎపిడెమియాలజీ, అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్ సమిరన్ పాండా కీలక వ్యాఖ‍్యలు చేశారు. ఆగస్టు చివరిలో కోవిడ్-19 థర్డ్ స్టేజ్ దేశాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు. అయితే సెకండ్ వేవ్ అంత తీవ్రంగా మూడో దశ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సూపర్ స్ప్రెడర్ సంఘటనలను నివారించడం, ఇతర జాగ్రత్త చర్యలతో దీని ఉధృతి ముడిపడి ఉందని తెలిపారు.
ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,13,069 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 715 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 918 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,35,320కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 76 కేసులు నిర్ధారణ కాగా, ఖమ్మం జిల్లా నుంచి 68, కరీంనగర్ నుంచి 52, మరియు నల్గొండ నుంచి 54 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,751కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 784 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,21,541 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,028 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.