BJP leaders under house arrest: ఛలో బాట సింగారం నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక, బీజేపీ ఆఫీసు ముందు రెండు ప్లాటూన్స్‌తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఈటల రాజేందర్ నివాసాలకు పోలీసులు భారీగా చేరుకుని హౌస్ అరెస్ట్ చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వర్షంలో రోడ్డుపై బైఠాయించి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు నిరసన తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ పరిశీలనకు వెళుతుంటే ఔటర్ రింగురోడ్డు వద్ద కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ జైళ్లు సిద్ధం చేసుకోండి. మేమంతా సిద్ధం అంటూ కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే హైదరాబాద్ లో డబుల్ పండుగ, 65వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధర్నాకు పిలుపు ఇవ్వడంతో బాటసింగారం వెళ్తున్న దారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇంటి ముందు రోడ్డు పై కూర్చొని నిరసన తెలిపిన ఈటెల రాజేందర్. బాటసింగారం బయలుదేరిన ఈటల రాజేందర్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఇంటిముందు రోడ్డుపై బైఠాయించి ఈటల రాజేందర్ నిరసన వ్యక్తం చేశారు.
Here's Videos
శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు
డబుల్ బెడ్ రూమ్ పరిశీలనకు వెళుతుంటే ఔటర్ రింగురోడ్డు వద్ద కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు.… pic.twitter.com/7MSfuTMiOT
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2023
ఇంటి ముందు రోడ్డు పై కూర్చొని నిరసన తెలిపిన ఈటెల
బాటసింగారం బయలుదేరిన ఈటల రాజేందర్, అడ్డుకున్న పోలీసులు. ఇంటిముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న ఈటల రాజేందర్. pic.twitter.com/VFdwan910o
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2023
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్
పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధర్నాకు పిలుపు ఇవ్వడంతో బాటసింగారం వెళ్తున్న దారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని అరెస్టు చేసిన పోలీసులు. pic.twitter.com/bHglBtWXLz
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2023
ఛలో బాట సింగారం కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వెళ్ళాలని బీజేపీ ప్లాన్ చేసింది. అయితే.. 6 లక్షల 10 వేల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తెలంగాణ సర్కార్ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని బీజేపీ చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో 2 లక్షల 83 వేల డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం మంజూరు చేసిందంటోంది. అయితే ప్రభుత్వం ఇళ్లను ఎందుకు చేపట్టలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర నిధుల నుండి ఒక్కో బెడ్ రూంకి 6 లక్షలు ఖర్చు చేసిన 2 లక్షల 83 వేల ఇళ్లు పూర్తి అయ్యేవని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే.. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయాయని, ఇందులో భాగంగానే సోషల్ ఆడిట్ ఇన్స్పెక్షన్ పేరుతో నేడు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు రెడీ అయ్యారు.
జన్ సున్వాయి పేరుతో బాట సింగారం వెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. దీంతో బీజేపీ నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల అక్రమ అరెస్ట్లను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఖండించారు. ఈ క్రమంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హౌస్ అరెస్ట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే బీఆర్ఎస్కు ఉలికిపాటెందుకు?. ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగబాటా?. కేవలం ఇళ్లు చూడటానికి వెళ్తుంటే భయమెందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.