TS Coronavirus: తెలంగాణలో 86 వేలు దాటిన కరోనా కేసులు, 665కు పెరిగిన మరణాల సంఖ్య, నిమ్స్‌కు చేరిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల యంత్రం కోబాస్‌- 8800
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Hyderabad, August 13: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1931 కరోనా కేసులు (TS Coronavirus Cases) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 23,303 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1931 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా (Coronavirus) బారిన పడ్డవారి సంఖ్య 86, 475కు చేరింది. తాజాగా కరోనాతో 11 మంది మృతి (Covid Deaths) చెందగా.. మరణాల సంఖ్య 665కు పెరిగింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

కరోనా నుంచి కొత్తగా 1780 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు 63,074 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,736 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 15,621 మంది హోం ,ఇతర ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంటున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 72.93 శాతంగా ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు 6,89,150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ లో 298, వరంగల్ అర్బన్ 144, రంగారెడ్డి 124, కరీంనగర్ 89 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న నెల తరువాత మళ్లీ పాజిటివ్, దేశంలో తాజాగా 66,999 మందికి కోవిడ్-19, భారత్‌లో 23,96,638కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

కరోనా నిర్ధారణకు అత్యంత ప్రామాణికంగా ఉన్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను పెద్దసంఖ్యలో చేసే కోబాస్‌- 8800 యంత్రం ఎట్టకేలకు నిమ్స్‌ ఆస్పత్రికి చేరుకుంది. 24 గంటల్లో దాదాపు 4 వేల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలుచేయడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మొత్తం రూ.7 కోట్ల విలువైన ఈ యంత్రం రెండునెలల రాంకీ సంస్థతో మాట్లాడిన కేటీఆర్ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద ఈ యాంత్రాలను తెప్పించాలని కోరారు. దాంతో రాంకీ సంస్థ కోబాస్‌ యంత్రాన్ని బుక్‌చేసింది. ఈ యంత్రం కోసం ఇప్పటికే రూ.కోటితో నిమ్స్‌లో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. 10 రోజుల్లో యంత్రం ఇన్స్టలేషన్‌ అవుతుందని, రెండువారాల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని నిమ్స్‌ ఉన్నతాధికారులు తెలిపారు. నా తండ్రి బతికే ఉన్నారు, సోషల్ మీడియాలో వార్తలను నమ్మవద్దంటూ అభిజిత్ ముఖ‌ర్జీ ట్వీట్, దేశంలో మీడియా ఫేక్ న్యూస్ క‌ర్మాగారంగా మారిందంటూ ఆగ్రహం

దీని వల్ల రాష్ట్రంలో గోల్డెన్‌ టెస్టులుగా చెప్పుకొనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య పెరుగుతుందని, తద్వారా కరోనా బాధితులను త్వరగా గుర్తించి చికిత్స అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. మరో యంత్రానికి ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ దృష్ట్యా సరఫరాలో ఆలస్యమయ్యే అవకాశమున్నదన్నారు.