Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Hyderabad, Nov 1: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,675 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,416 పాజిటివ్‌ కేసులు (TS Covid Update) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,40,048కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,341కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

నిన్న ఒక్క రోజే 1,579 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,20,466కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,241 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 15,388 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 43,23,666కి చేరింది.

దేశంలో గడిచిన 24 గంటల్లో 46,963 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (COVID-19 in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,84,082కు చేరింది. నిన్న ఒక్క రోజే 470 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,22,111 మంది కరోనాతో (Covid Deaths) మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

బీజేపీ ఆఫీసు వద్ద కార్యకర్త ఆత్మహత్యాయత్నం, బండి సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న కార్యకర్త

నిన్న 58,684 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 74,91,513మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91.54 శాతంగానూ.. నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.97 శాతంగా ఉంది. మరణాల రేటు 1.49 శాతానికి తగ్గింది.