Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Hyderabad, Oct 10: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కేసులు (Coronavirus in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,346 కు (Coronavirus cases) చేరింది. కరోనా బారిన పడి మరో 9 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,217 కి (Coronavirus Deaths) చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. గత 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో 2,072 కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,83,025కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో లక్షణాలు లేకుండానే కరోనా బారినపడిన వారు 70 శాతం మంది ఉంటారని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకు డు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా, తెలంగాణలో 0.57 శాతముంది. అలాగే దేశంలో కోలుకున్నవారి రేటు 85.5 శాతం ఉండగా, తెలంగాణలో 86.77 శాతముందని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

కరోనా మా దేశంలో పుట్టలేదంటున్న చైనా, భారత్‌లో తాజాగా 73,272 మందికి కరోనా, 24 గంటల్లో 926 మంది మృతితో 1,07,416 కు చేరుకున్న మరణాల సంఖ్య

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో 17 చోట్ల, ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో 44 చోట్ల ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇవిగాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,076 కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. మొత్తం కలిపి ప్రతీ రోజూ ప్రభుత్వంలో దాదాపు 12 వేల పరీక్షలు, ప్రైవేట్‌లో 8 వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. అయితే ప్రభుత్వంలో యాంటిజెన్‌ పరీక్షలు చేస్తుండటం, అర గంటలోపే ఫలితం వస్తుండటంతో ప్రజలు అటువైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో పరీక్షలు చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.