Harish Rao tested positve for Corona (photo-PTI)

Hyderabad, Sep 5: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,511 పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,395కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 877కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,04,603. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,915. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావుకు కరోనా వైరస్‌ (Harish Rao tested positve for Corona) సోకింది. ఈ మేరకు శనివారం ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆయన తనకు వైరస్‌ సోకినట్లు వెల్లడించారు.. ‘‘ కరోనా లక్షణాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. టెస్టులో పాజిటివ్‌ వచ్చింది.

Here's Minister Tweet

ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నన్ను కలిసిన వారందరూ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా పరీక్షలు చేయించుకోండ ’’ని కోరారు. కాగా, పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో ఆయన త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు దూరం కానున్నారు. ఇండియాలో రెండవ ధపా కరోనా వేవ్, వ్యాక్సిన్‌పై ఇంకా క్లారిటీ లేదు

ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.24 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 75.5 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.73 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.63 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 62,132 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 16,67,653కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.