Piyush-Goyal (Photo Credits: Twitter)

Hyd, Dec 21: తెలంగాణ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురిచేస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రధాని కృషి చేస్తున్నారని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Union Minister Piyush Goyal) అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రైతులను గందరగోళ పరుస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో (Paddy Procurement in TS) రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో దిల్లీలో ఆయన.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర భాజపా నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు

రబీ సీజనులో ధాన్యం సేకరణపై ( Issue Of Paddy Procurement) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. గత రబీలో అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనేందుకు సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించలేదని మండిపడ్డారు.

నాలుగు సార్లు గడువు కూడా పొడిగించాం. దేశంలో ఉప్పుడు బియ్యాన్ని చాలా తక్కువగా తింటారని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందన్నారు. ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచినట్లు చెప్పారు.సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రా రైస్‌ ఎంత ఇచ్చినా కేంద్రం తీసుకుంటుందని గతంలోనే స్పష్టం చేశామన్నారు. కేంద్రంపై అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని పీయూష్‌ గోయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. . రా రైస్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మొత్తం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పీయూష్‌ గోయల్‌ అన్నారు.

తెలంగాణలో చలి పంజా, మరో మూడు రోజుల పాటు వణుకు తప్పదంటున్న వాతావరణ శాఖ, ఏపీలో రోజు రోజుకు తీవ్రమవుతున్న చలి

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ కలిపి ఎఫ్‌సీఐకి 27.39లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలి. ఎఫ్‌సీఐకి ధాన్యం సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాతే కేసీఆర్‌ బియ్యం అంశాన్ని లేవనెత్తారు. మెడపై కత్తి పెట్టి రాయించుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు.

ఒప్పందం ప్రకారం రా రైస్‌ ఎంత వస్తే అంతా కొంటామని గోయల్‌ చెప్పారు. 2022 సీజన్‌ ధాన్యం సేకరణ ప్రారంభం కాబోతోంది. జనవరి నుంచి 31వరకు 40లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఒప్పందం జరిగింది. ప్రతి గింజా కొంటామని కేసీఆర్‌ చెప్పలేదా?రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు చేసి రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా?'' అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

లిఖితపూర్వక హామీ ఇవ్వాలని తెలంగాణ మంత్రులు, ఎంపీలు డిమాండ్‌

ప్రస్తుత వానాకాలానికి సంబంధించి కేంద్రం నిర్దేశించిన మేరకంటే అధికంగా వచ్చే ధాన్యాన్ని సేకరించే విషయమై రాష్ట్రానికి కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని తెలంగాణ మంత్రులు, ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఎంతైనా కొంటామని నోటి మాటలు చెబితే కుదరదని, అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, నేతకాని వెంకటేశ్, పసునూరి దయాకర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుత వానాకాలానికి సంబంధించి 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తామని కేంద్రం చెప్పింది. కేంద్రంతో ఎంఓయూ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ లక్ష్యాన్ని మరింత పెంచాలని కోరారు. కొనుగోళ్లు మొదలయ్యాక దీనిపై చర్చిద్దామని కేంద్రమంత్రి అన్నారు. ఇప్పటికే 55 లక్షల టన్నుల సేకరణ పూర్తవగా, మంగళవారానికి కేంద్ర లక్ష్యం మేరకు కొనుగోళ్లు పూర్తవుతాయి. అయితే కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది. భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వరి కోతలు జరిగితే మరో 5 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చే అవకాశం ఉంది.

అందువల్ల అదనంగా కొనుగోళ్లు చేస్తామని కేంద్రం నోటిమాటలు చెబితే చెల్లుబాటు కాదు. ఎంత వస్తే అంత తీసుకుంటామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి..’అని డిమాండ్‌ చేశారు. అదనంగా వచ్చే ధాన్యాన్ని రాష్ట్రం సేకరించాక కేంద్రం డబ్బులు ఇవ్వకుంటే రాష్ట్రం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంతో ఇప్పటికే అనేక చేదు అనుభవాలు ఉన్న దృష్ట్యా లిఖిత పూర్వక హామీ కోరుతున్నామని చె ప్పారు. ఈ అంశాన్ని రైతు ప్రయోజనాల కోణంలో చూడాలని కోరారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రస్తుత వానాకాలం సేకరణపై తాము నిలదీస్తుంటే, ఆయన గత యాసంగి సేకరణపై మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లింగ్‌ చేస్తున్నా, ఎఫ్‌సీఐ మాత్రం నెలకు 5 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటోందని, దీనికి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ధాన్యం సేకరణ పెరుగుతున్నా, కేంద్రం అదనంగా ఒక్క గోదామును ఎందుకు కట్టలేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.