Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Warangal, May 16: ప్రేమించానని వెంటపడి పెళ్లి చేసుకొని ఇద్దరు మహిళలను కిరాతకంగా హత్య (Sadist Husband assassinated his two wives) చేశాడు ఓ శాడిస్టు భర్త. రెండో భార్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు మొదటి భార్య ఉదంతం తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసుల కథనం, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

వరంగల్ రూరల్ జిల్లా (warangal rural district Telangana) పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామానికి చెందిన కర్నె కిరణ్ ఆరేళ్ల క్రితం రైల్వేస్టేషన్‌లో ఒక మహిళను చూసి ప్రేమించానంటూ వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెను తరచూ వేధించడంతో పాటు పలుమార్లు కొట్టి గాయపర్చడంతో ఆరేళ్ల క్రితం మృతి చెందింది. ఈ విషయం బయటకు పొక్కకుండా శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. గ్రామంలో ఉంటే మళ్లీ పోలీసులు వస్తారని భావించి వరంగల్‌లో ఉంటూ హుజూరాబాద్‌లో నర్సుగా పనిచేసే అంజలీ బాయి (43)ని రెండో వివాహం చేసుకుని ఆమె ఇంట్లోనే కాపురం పెట్టాడు.

సముద్రపు ఒడ్డున యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం, భాయ్ ఫ్రెండే కీలక సూత్రధారి, ముంబై బాంద్రాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

రెండేళ్లుగా ఆమె ఇంటి వద్దే ఉండి, ఆరు నెలల క్రితం ఏనుగల్లుకు వచ్చాడు. అప్పట్నుంచీ ఇళ్లు అమ్మి డబ్బు తీసుకురావాలని రెండో భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఈనెల 13వ తేదీన తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14వ తేదీన మరణించింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కిరణ్‌ను విచారించారు. ఈ క్రమంలో మొదటి భార్యను కూడా హత్య చేశానని, ఆమె శవాన్ని తాను ఉండే ఇంటి ఆవరణలోనే పాతిపెట్టానని వెల్లడించాడు. దీంతో పోలీసులు ఆదివారం మృతదేహాన్ని బయటకు తీయాలని నిర్ణయించారు. అంజలీబాయి తల్లి ఓడపల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేష్‌కుమార్‌ శనివారం తెలిపారు.

కరోనా సోకి వెంటిలేటర్‌పై ఉన్న మహిళను వదలని కామాంధుడు, దారుణంగా అత్యాచారం చేయడంతో 43 ఏళ్ల మహిళ కన్నుమూత, భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఘటన

ఇదిలా ఉంటే నిందితుడు కిరణ్‌ వ్యవహార శైలి కారణంగా తల్లిదండ్రులు అతనికి వివాహం చేయకుండా వదిలేశారు. దీంతో అక్కడక్కడా తిరుగుతూ తొలుత ఎవరూ లేని అనాథకు వల వేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోనే బంధించి వేధింపులకు గురిచేసి చంపేశాడు. ఆమె అనాథ కావడంతో దీనిపై ఎలాంటి ఫిర్యా దు నమోదు కాలేదు. గతంలో ఓసారి కిరణ్‌ వ్యవహార శైలి తెలుసుకున్న అప్పటి పర్వతగిరి ఎస్సై రమేష్‌నాయక్‌ ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినా తప్పించుకువచ్చాడు.