Hyd, Aug 14: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన సాగింది.
10 రోజుల పర్యటనలో భాగంగా 50 కిపైగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను వివరించారు.
Here's Video:
బీఆర్ఎస్ రెండుసార్లు ఫ్లాప్ అయ్యింది.. అయినా బుద్ధి రాలేదు.
ఇలాగే మాట్లాడితే మరోసారి ఫ్లాప్ అవ్వడం ఖాయం.
మా పర్యటనలపై బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోంది.
ఇదేమీ పోటీ పర్యటన కాదు.. రాష్ట్ర అభివృద్ధి కోసమే మా ప్రయత్నం.#CMrevanthreddy #MinisterSridharBabu #Congress #RevanthReddy… pic.twitter.com/W1LyuKxvVK
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2024
స్కిల్ యూనివర్సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డేటా సెంటర్స్,ఫార్మా, లైఫ్ సైన్సెస్, కాస్మటిక్స్, టెక్స్‌టైల్, ఎలక్ట్రిక్ వాహన రంగాలకు చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. స్టాన్ ఫర్డ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును చేయాలని కోరిన రేవంత్
Here's Video:
అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి @revanth_anumula గారు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పది రోజుల పాటు సాగిన పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం… pic.twitter.com/pJlX8qSMBq
— Telangana CMO (@TelanganaCMO) August 14, 2024
ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కోకాపేటలో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు..బీఆర్ఎస్ రెండుసార్లు ఫ్లాప్ అయ్యింది.. అయినా బుద్ధి రాలేదు అన్నారు. ఇలాగే మాట్లాడితే మరోసారి ఫ్లాప్ అవ్వడం ఖాయం..మా పర్యటనలపై బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందన్నారు. ఇదేమీ పోటీ పర్యటన కాదు.. రాష్ట్ర అభివృద్ధి కోసమే మా ప్రయత్నం అని తేల్చిచెప్పారు.
Here's Video:
హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు.#CMrevanthreddy #Congress #ShamshabadAirport #NewsUpdates #Bigtv @INCTelangana @revanth_anumula https://t.co/hmsYn1OrPA pic.twitter.com/05XNfXaGtI
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2024