Orange Alert for Telangana: మండుతున్న ఎండలు, తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్, వచ్చే 5 రోజులు వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక 
Representational picture. (Photo credits: PTI)

Hyd, April 26:తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చే అయిదు రోజులు తెలంగాణలో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌లో వాతావరణం కేంద్రం పేర్కొంది. ఈనెల 28, 29, 30 అధికంగా వడగాల్పులు వీచే అవకాశంతో ఉందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుంచి వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నే నమోదయ్యే ఛాన్స్‌ ఉందని వెల్లడించింది.

11 నుంచి 4 మధ్య బయటకు రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు. శుక్రవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశంతో ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.  మరో మూడు రోజులు వడగాడ్పులు మరింతగా పెరిగే అవకాశం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

రేపు(శనివారం) మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వాడగాల్పులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈనెల 28, 29వ తేదీనా నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిలాల్లో అధికంగా వడగాల్పులు విచే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

28వ తేదీన మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 29న కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 30న తేదీన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపే,ట జోగులాంబ గద్వాల్‌కు ఆరెంజ్అలెర్ట్ జారీ చేసింది. 30న జగిత్యాల రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది