Telangana Weather Update: హైదరాబాద్ వాసులకు చల్లటి కబురు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం, తెలంగాణలో 14 జిల్లాల్లో వర్షాలు
Rains (Credits: Pixabay)

మండే ఎండలతో అల్లాడిపోతున్న నగర వాసులకు ఐఎండీ చల్లని కబురును అందించింది. తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ తెలిపింది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు పడతాయని అంచనా వేసింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లె, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరో మూడు రోజులు వడగాడ్పులు మరింతగా పెరిగే అవకాశం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

వర్షాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలకు పడిపోవచ్చు. అయితే అన్ని జిల్లాలకు వర్ష సూచన లేదని తెలుస్తోంది. ఆదివారం జగిత్యాల, ములుగు, నల్గొండ, కరీంనగర్‌లలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చార్మినార్ వద్ద అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నగరంలోని బహదూర్‌పురా, షేక్‌పేట్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బండ్లగూడ, సైదాబాద్, మారేడ్‌పల్లిలో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.