Hyderabad Rains Video (photo-ANI)

Hyd, June 27: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌, మైత్రీవనం, అమీర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, దిల్‌షుక్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

మరోవైపు చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలో మరో వారం రోజులు పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్నిచోట్లు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  తెలంగాణ ఆర్టీసీ బ‌స్సుల్లో త‌ప్ప‌నున్న‌ చిల్ల‌ర క‌ష్టాలు, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా టికెట్లు తీసుకునే అవ‌కాశం

ఇక తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. నేడు, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది.

శుక్రవారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.