Hyd, April 4: తెలంగాణలో గత వారం రోజుల నుంచి ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. తాజాగా ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ వినిపించింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ vs బెంగుళూరు, డీకే శివకుమార్ మంత్రి కేటీఆర్ మధ్య ఐటీ గురించి ఆసక్తికర ఛాలెంజ్ చర్చ
రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్ నగరమంతా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.